మారిన ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్.. తెలుసుకోండి..

అక్టోబర్ 1 నుంచి ట్రైన్ టికెట్ బుకింగ్‌లకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేశారు.

బుకింగ్ విండో ఓపెన్ అయ్యాక మొదటి 15 నిమిషాల్లోపు టికెట్లు బుక్ చేసుకునే వారు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.

బాట్‌లు, దళారులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడాన్ని నిరోధించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు.

బుకింగ్ విండో తెరిచిన మొదట 15 నిమిషాలలోపు టికెట్ బుక్ చేసుకోవాలనుకునే ఎవరైనా తమ ఆధార్‌ను ధృవీకరించడం తప్పనిసరి.

తత్కాల్ పథకం కింద టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేశారు.

సాధారణ రిజర్వేషన్లకు కూడా మొదటి 15 నిమిషాల ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేశారు.

బుకింగ్ విండో 15 నిమిషాలు ముగిసిన తరువాత ఆధార్ ధృవీకరణ అవసరం లేదు.

ఇక టికెట్ బుకింగ్ విండో తెరిచిన తరువాత మొదటి 10 నిమిషాల పాటు ఏజెంట్లు టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు.