జుట్టుకు రంగువేసేప్పుడు  తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

జుట్టుకు రంగు వేసుకునేప్పుడు కొన్ని టిప్స్‌ పాటిస్తే.. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. జుట్టుకు రంగు కూడా ఎక్కుకాలం పట్టి ఉంటుంది.

కొందరు తెల్ల జుట్టును కవర్‌ చేయడానికి నల్ల రంగు వేస్తుంటే.. మరికొందరు స్టైల్‌ కోసం జుట్టుకు రకరకాల రంగుల వేసేస్తున్నారు.

అయితే కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోతే జుట్టుకు రంగువేశాక హెయిర్ డ్యామేజ్ అవుతుంది.

రంగు వేసుకునే ముందు కచ్చితంగా ప్యాచ్ టెస్ట్ వేసుకోవాలి.

జుట్టుకు రంగు వేసుకునే ముందు ముఖానికి మాయిశ్చరైజర్‌, నూనె రాసుకోండి. ఇలా చేస్తే ముఖానికి రంగు అంటినా.. త్వరగా వదులుతుంది.

తలకు డై వేసుకున్న తర్వాత.. మరీ వేడి నీళ్లతో తలస్నానం చేయవద్దు. వేడి నీళ్లు కుదుళ్లు తెరుచుకునేలా చేస్తాయి. దీని వల్ల రంగు త్వరగా పోతుంది.

సల్ఫేట్ ఫ్రీ షాంపూలు ఎంచుకుంటే మంచిది. ఇది రంగును వెలిసిపోకుండా చేస్తుంది.