నాటు కోడిగుడ్డులో ఎంత ప్రోటీన్
ఉంటుందో తెలుసా..?
దేశీ కోడి నుంచి వచ్చే గుడ్డును నాటుకోడి గుడ్డు అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఒక గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక దేశీ గుడ్డులో ప్రోటీన్ పరిమాణం గుడ్డు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
చిన్న సైజు నాటుకోడి గుడ్డులో దాదాపు 4 నుంచి 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
పెద్ద సైజు గుడ్డులో 6 నుంచి 7 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుందట.
కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, విటమిన్ ఇ, ఫోలేట్, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
దీనిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎముకలకు మంచిది.
దేశీ కోడిగుడ్డు కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట.
Related Web Stories
దక్షిణాది 6 బెస్ట్ ఫిష్ కర్రీస్ ఇవే
ఉడికించిన గుడ్ల తొక్క సరిగ్గా రావడం లేదా..
మారిన ట్రైన్ టికెట్ బుకింగ్ రూల్స్.. తెలుసుకోండి..
పూలతో మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి