క్యాలెండర్‌లో తేదీలు మారడమే కాదు… నూతన సంవత్సరం మన జీవితాల్లో కొత్త ఆశలను, కొత్త లక్ష్యాలను తీసుకొస్తుంది.
న్యూ ఇయర్ మొదటి రోజున చేసే పనులు ఏడాది పొడవునా ప్రభావం చూపుతాయని జ్యోతిష్యం చెబుతోంది.
ఈ రోజున వాదించడం, ఒకరిపై ఒకరు అరవడం వంటివి చేయకూడదు. మొదటి రోజే ఇంట్లో మనస్పర్థలు వస్తే.. ఆ ఏడాది పొడవునా మానసిక ఒత్తిడి కొనసాగుతుందని పెద్దల నమ్మకం.
ఈ రోజున ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నూతన సంవత్సరం అనేది సరికొత్త శక్తికి ప్రతీక కాబట్టి ముదురు నలుపు రంగు దుస్తులు ధరించకపోవడమే మంచిది.
కొత్త ఏడాది రోజున ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద దేవుని గదిలో దీపాలు వెలిగించాలి.
గతాన్ని మర్చిపోయి, చిరునవ్వుతో కొత్త ఏడాదికి స్వాగతం పలకండి.
మొదటి రోజు తీసుకునే అడుగే ఏడాది ప్రయాణానికి దిశ చూపుతుంది. కాబట్టి సానుకూల ఆలోచనలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించండి.
Related Web Stories
రైలు చివరి బోగి మీద X అని ఎందుకు ఉంటుందో తెలుసా
ఫొటో కలెక్షన్ ఆఫ్ ది డే
ఈ చిట్కాలు పాటించండి.. సులువుగా బరువు తగ్గండి
చారిత్రాక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహానగర ప్రస్థానం