చారిత్రాక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ మహానగర ప్రస్థానం

గోల్కొండ కోటను కాకతీయులు ప్రారంభించగా.. కుతుబ్ షాహీలు బలపరిచారు. భాగ్యనగర చారిత్రక కట్టడాలలో ఇదో అద్భుతమైన నిర్మాణం.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఓ చారిత్రక ప్రదేశమే ఫతే మైదాన్. ప్రస్తుతం దీనిని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంగా పిలుస్తున్నారు.

నాంపల్లిలో ఉండే పబ్లిక్ గార్డెన్స్‌ పురాతన ఉద్యానవనాల్లో ఒకటి. దీనిని 1846లో నిజాం రాజు నిర్మించాడు.

భాగ్యనగరంలోని మరో ప్రసిద్ధ ప్రాంతం చాదర్‌ఘాట్. ఇది మూసీ నదిని మూసీనదిని ఆనుకుని ఉండి కోఠి, మలక్‌పేటలను వేరు చేస్తుంది.

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉన్న ఓ చారిత్రక, రద్దీగా ఉండే ప్రాంతమే ఉందా బజార్. ఇక్కడ వివిధ రకాల వస్తువులతో పాటు సుగంధ ద్రవ్యాలు లభిస్తాయి.

గౌలిగూడ అనేది హైదరాబాద్ తొలి ప్రధాన బస్‌స్టాండ్‌కు కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం కూలిపోయినా ప్రింటింగ్ ప్రెస్, పాత ఇళ్లు, మార్కెట్లు వంటివి ఉన్నాయి.

సికింద్రాబాద్ శివారులో మల్కాజ్ గిరికి వెళ్లే మార్గంలో లాలాగూడ ప్రాంతం ఉంటుంది. రైల్వే సౌకర్యాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.

హైదరాబాద్‌లోని మరో చారిత్రాత్మక రద్దీ ప్రాంతమే సుల్తాన్ బజార్. ఇది వాణిజ్యానికి కేంద్ర బిందువు.

ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్, అసఫ్ జా-6 కుమార్తె బషీర్ ఉన్నిసా బేగం పేరుమీద దీనికి బేగంపేట అనే పేరు వచ్చింది.

నిజాం కాలంలోని రెవెన్యూ విభాగ ఉద్యోగి అయిన సోమాజీ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించడంవల్ల సోమాజీగూడ వచ్చింది. గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్ ఇక్కడే ఉంటుంది.