షుగర్ వ్యాధిగ్రస్తులు పరగడుపునే తినాల్సినవి, తినకూడనివి ఇవే..!

ఒక స్పూన్ నెయ్యిని పసుపుతో కలిపి పరగడుపునే తీసుకోవాలి. స్వీట్లు తినాలనే కోరికను నెయ్యి తగ్గిస్తుంది. అలాగే షుగర్ పేషెంట్లలో సాధారణంగా కనిపించే ఇన్‌ఫ్లమేషన్‌ను పసుపు దూరం చేస్తుంది.

షుగర్ పేషెంట్లు పరగడుపునే 30 ఎమ్‌ఎల్ ఉసిరి జ్యూస్ కానీ, నిమ్మరసం కానీ తీసుకోవడం వల్ల శరీరం ఆల్కలైజ్ అవుతుంది. డయాబెటిస్ వల్ల వచ్చే పలు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.

పరగడుపునే దాల్చిన చెక్క పౌడర్ కలిపిన నీరు తాగితే రోజంతా మీ రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.

మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టి పరగడుపునే తీసుకోవాలి. ఫలితంగా కార్బోహైడ్రేట్ల శోషణం తగ్గుతుంది.

నానబెట్టిన బాదం గింజలు, వాల్ నట్స్ మొదలైన ప్రోటీన్లను పరగడుపునే తీసుకోవడం షుగర్ పేషెంట్లకు మంచి చేస్తుంది. 

పరగడుపునే అరటిపళ్లు తినడం షుగర్ పేషెంట్లకు మంచిది కాదు. అరటి పళ్లు తినడం వల్ల రక్తంలో ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి.

చాలా మంది ఉదయాన్నే తేనెను నీటిలో కలుపుకుని తాగుతారు. షుగర్ పేషెంట్లు మాత్రం తేనెను తీసుకోకూడదు.

పంచదార ఎక్కువ వేసిన టీ, కాఫీ కూడా ఉదయాన్నే తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి.

పళ్లను నేరుగా తినడం మంచిదే కానీ, పరగడుపునే పంచదార వేసిన ఫ్రూట్ జూస్‌ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.