పుచ్చకాయ గింజలు పారేయకండి.. ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

పుచ్చకాయ గింజల్లో లినోలిక్ యాసిడ్, ఓలియక్ యాసిడ్ అనే అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా అడ్డుకుంటాయి.

మధుమేహంను నియంత్రణలో ఉంచడంలో పుచ్చ గింజలు ఎంతో ఉపయోగపడతాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాల్లో తేలింది.

లైకోపీన్ అనే బలమైన యాంటీ-ఆక్సిడెంట్లు పుచ్చకాయ గింజల్లో ఉంటాయి. ఇవి పురుషుల్లో సంతానోత్పత్తి శక్తిని పెంచుతాయి.

జ్ఞాపక శక్తి పెరగడానికి, మెమొరి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి పుచ్చకాయ గింజలు మంచి ఔషధంలా పని చేస్తాయి.

పుచ్చకాయ గింజల్లోని అర్జినిన్ అనే రసాయనం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బి-కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగిన పుచ్చకాయ గింజలు మెటబాలిజమ్‌ను మెరుగుపరుస్తాయి.

పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్లు, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్య సంరక్షణకు సహకరిస్తాయి.

పుచ్చకాయ గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.