గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేసేందుకు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే 5 సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈజీగా చేసేయొచ్చు.

ఉప్పు, బేకింగ్ సోడా మిశ్రమాన్ని స్టవ్‌పై మరకలు ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

బర్నర్‌పై వెనిగర్ వేసి ఆరబెట్టాలి. తర్వాత స్పాంజితో శుభ్రం చేయాలి.

నిమ్మకాయ తొక్క, రసాన్ని మరకలపై రుద్దాలి. కొన్ని నిముషాల తర్వాత డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో కడిగేయాలి.

పాత్రలో నీటిని మరిగించి, స్టవ్‌పై మరకలు ఉన్న చోట పెట్టాలి. తర్వాత సబ్బు నీటితో స్క్రబ్ చేయాలి.

ఉల్లిపాయ ముక్కలను ఉడకబెట్టిన నీరు, స్పాంజ్ సాయంతో జిడ్డు మరకలను సులభంగా తొలగించవచ్చు.