మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?..  అయితే జాగ్రత్త..!

మన రోజంతా ఎలా ఉంటుందనేది మన ఉదయం దినచర్యపై ఆధారపడి ఉంటుంది.

మనం రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, కరెక్ట్‌గా పనిచేయాలన్నా మన శరీరానికి మంచి శక్తి స్థాయిలు చాలా అవసరం.

చాలా మంది నిద్ర లేవగానే తమ మొబైల్ వైపు చూస్తారు.  ఈ అలవాటు ఖచ్చితంగా మంచిది కాదు.

నిద్రలేచిన తర్వాత మీ మొబైల్ ఫోన్ చూసే బదులు, కనీసం ముప్పై నిమిషాలు యోగా, ధ్యానం లేదా వ్యాయామం చేయండి.

చాలా మంది కళాశాల లేదా ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లడం వల్ల అల్పాహారం మానేస్తారు. ఉదయం తినకుండా ఆకలితో ఉండటం హానికరం.

ఇది మెదడు శక్తిని తగ్గిస్తుంది. ఇది మీ ఏకాగ్రత, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది.

నిద్రకు ఒక షెడ్యూల్‌ లేకుండా పడుకోవడం వల్ల మీ శరీరం యొక్క సహజ సిర్కాడియన్ లయకు అంతరాయం కలుగుతుంది.

ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం కూడా మంచిది కాదు. ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోండి.

ఉదయం నీరు తాగడం అలవాటు చేసుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం