వర్షాకాలంలో చుండ్రు
వదిలించుకోవడానికి 5 చిట్కాలు..
వానాకాలంలో అధిక తేమ చుండ్రుకు కారణమయ్యే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేలా ప్రేరేపిస్తుంది. అందుకే జుట్టును ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోండి.
యాంటీ డాండ్రఫ్ షాంపూతో జుట్టును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. తేలికపాటి, సల్ఫేట్ లేని యాంటీ డాండ్రఫ్ షాంపూని వాడాలి.
ఈ కాలంలో జుట్టుకు నూనె ఎక్కువగా రాయడం వల్ల చుండ్రు తీవ్రమవుతుంది. తలస్నానానికి 20-30 నిమిషాల ముందు నూనెతో మసాజ్ చేసుకుంటే చాలు.
వారానికి ఒకసారి పెరుగు, నిమ్మకాయ లేదా ఆపిల్ సిడార్ వెనిగర్ లలో ఏదొక దానిని తలకు పట్టించుకోండి. ఇవి చుండ్రుకు సహజ నివారణలు.
సొంత దువ్వెనలు, టవల్స్, తలగడలు మాత్రమే ఉపయోగించండి. వేరొకరు వాడినవి వాడితే వాడితే చుండ్రు వ్యాపిస్తుంది.
Related Web Stories
అరటి పళ్లను ఇలా మాత్రం తినకండి..!
కొత్తగా కొన్న దుస్తుల కలర్ పోతోందా.. ఇలా చేయండి చాలు..
ఇలా వంట చేస్తే.. ఉపయోగం లేదు..
ఈ మందులు అతిగా వాడుతున్నారా..?ఇది తప్పక తెలుసుకోండి!