బతుకమ్మ ఆడి సందడి చేసిన  సుందరీమణులు

విశ్వ నగరం హైదరాబాద్ వేదికగా మిస్‌ వరల్డ్‌ - 2025 పోటీలు జరుగుతోన్నాయి.

ఈ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు 109 దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ తరలి వచ్చారు.

 తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాల్లో వారు పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు.

హన్మకొండలోని హరితా రిసార్టు వద్ద స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మలు పట్టుకున్న సుందరీమణులు

హరితా రిసార్ట్‌లోకి వస్తూ.. అందరికి నమస్కరిస్తున్న సుందరిమణి. బతుకమ్మతో రిసార్టులోకి వస్తున్న మరో సుందరీమణి

హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్టు వద్ద మహిళలతో కలిసి సుందరీమణులు బతుకమ్మ ఆడి సందడి చేశారు.

రిసార్ట్‌లో బతుకమ్మ ఆడుతోన్న స్థానికులు.. వీక్షిస్తున్న సుందరీమణులు బతుకమ్మ ఆడుతోన్న సుందరీమణులు