పిల్లల్లో మానసిక ఆరోగ్యం తక్కువగా ఉండటానికి కారణాలివే..

పిల్లలు చదువులోనూ, ఆటపాటల్లోనూ ఆశక్తిని పెంచడానికి అలవాట్లను నేర్పాలి.

విద్యాపరమైన అంచనాలు పెరుగడం కారణంగా పెరిగే ఒత్తిడి, ఇంటి వాతారణం ఇవన్నీ మానసిక ఆందోళనను పెంచుతాయి.

శారీరక బెదిరింపులు పిల్లల్ని మానసికంగా ఆరోగ్యంపై ప్రభావాన్నిచూపుతాయి.

కుటుంబంలో ఘర్షణలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణాలు పిల్లల్ని మానసికంగా ప్రభావితం చేస్తాయి.

హింస, ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, బాధాకరమైన సంఘటనలకు గురికావడం వంటివి మానసిక క్షోభకు దారితీస్తాయి.

పిల్లలు తల్లిదండ్లుల నుంచి కోరుకునే ప్రేమ అందనపుడు పరిస్థితి, డిప్రెషన్, మానసిక రుగ్మతలకు దారితీస్తుంది.

న్యూరో డెవలప్ మెంటల్ డిజార్డర్స్, అభ్యాస వైకల్యాలు వంటి పరిస్థితులు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

పేదరికం, నిరాశ్రయత, వివక్ష వంటి అంశాలు కూడా పిల్లలపై దీర్ఘకాలిక ఒత్తిడిని పెంచుతాయి.