ఈ తొక్క వాడితే..  ముఖంపై పింపుల్స్ రానే రావు..

మొటిమలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. బయట దుమ్ము ధూళి కాస్త పడగానే ఒకదానివెంట మరొకటి పుట్టుకొచ్చేస్తాయి.

 ఈ సమస్యతో బయట అందరిలో తిరగాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు

 ఈ తొక్క వాడితే మీ ముఖంపై మొటిమలు తొలగిపోయి అద్దంలా మెరిసిపోవడం ఖాయం. ఓ సారి ప్రయత్నించండి..

నిమ్మ తొక్కను చిన్న ముక్కలుగా చేయండి. తరువాత దానికి కొంచెం తేనె కలిపి ఆపై కాసింత శనగపిండి జోడించండి.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకుని మెల్లగా రుద్దండి. 10-15 నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

5 నిమిషాలు గడిచాక తిరిగి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

ఇలా చేస్తే ముఖంపై పింపుల్స్ ,పిగ్మెంటేషన్ సమస్యలు  తొలగిపోయి ముఖంగా క్లియర్ అవుతుంది.