గుడ్లగూబ పలు దేశాల్లో గుడ్లగూబలను మరణానికి సంకేతంగా భావిస్తుంటారు. ఉదయాన్నే గుడ్లగూబను చూడడం చెడు సంకేతంగా భావిస్తారు.
కాకులు మనదేశంలోనే కాదు.. చాలా దేశాల్లో కాకులను ఆత్మల యొక్క దూతలుగా భావిస్తారు. వాటిని దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు.
నల్ల పిల్లి అనేక సాంప్రదాయాలు, సంస్కృతులలో నల్ల పిల్లలును చెడు శకునంగా భావిస్తారు. ఎక్కడికైనా వెళ్లినపుడు నల్ల పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని అంటుంటారు.
పాములు పాశ్చాత్య దేశాల్లో పాములను చెడ్డ విషయాలకు సంకేతాలుగా భావిస్తారు. దురదృష్టాన్ని కలిగిస్తాయని నమ్ముతారు
సాలెపురుగులు తంత్ర విద్యలు, అతీంద్రియ శక్తులతో సాలె పరుగులకు సంబంధం ఉంటుందని చాలా మంది ఇప్పటికీ నమ్ముతుంటారు.
టోడ్స్ కప్పల్లోని ఈ జాతిని కూడా దురదృష్టానికి, చెడుకు సంకేతాలని నమ్ముతుంటారు.
బల్లులు పైన పడితే కొన్ని జరుగుతాయని మనదేశ వాసులు బలంగా నమ్ముతారు. కొన్ని ఇతర దేశాల్లో వీటిని చెడుకు సంకేతాలుగా భావిస్తారు.