సమ్మర్ స్పెషల్ ఈ బెంగాలీ షర్బత్..  ఎప్పుడైనా తాగారా..

ఆమ్ పోరా షర్బత్ ఒక బెంగాలీ వేసవి డ్రింక్ 

పచ్చి మామిడికాయలతో ఈ షర్బత్‎ను తయారు చేస్తారు

కావాల్సినవి కాల్చిన పచ్చి మామిడికాయలు, చక్కెర, జీరా పొడి, నల్ల ఉప్పు, చల్లటి నీరు, కొన్ని పుదీనా ఆకులు కలిపి తీసుకోవాలి

 మామిడికాయలను తక్కువ మంట మీద ఉంచి, అవి మండిపోయే వరకు వేయించాలి

పూర్తయిన తర్వాత, వాటిని మంట మీద నుండి తీసి చల్లర్చాలి

తొక్కలన్నీ తీసివేసి, గుజ్జుగా చేసి, బ్లెండర్‌లో వేసి, చక్కెర, పుదీనా ఆకులు, జీరా పొడి, నల్ల ఉప్పు వేసి, మిక్స్ చేయాలి

మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోని, చల్లటి నీళ్లు పోసి, బాగా కలపాలి

రుచికరమైన బెంగాలీ ఆమ్ పోరా షర్బత్ రెడీ