స్త్రీ లకు  గాజులు ఎంత  అవసరమో తెలుసా

స్త్రీలు గాజులు ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

 ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా గాజులు ధరించడం చాలా మంచిది.

ఆడవారు ధరించే ప్రతీ ఆభరణానికి అనేక లాభాలు ఉన్నాయి.

ఫ్యాషన్ పేరుతో పెద్దగా ఎవరూ గాజులు ధరించడం లేదు. పెళ్లైన వారు కూడా సరిగా గాజులు వేసుకోవడం లేదు.

అప్పుడే పుట్టిన ఆడ పిల్లలకు గాజులు వేస్తూ ఉంటారు. చేతికి నిండుగా గాజులు కనిపించడం వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుందని అంటారు.

రంగు రంగుల గాజులు వేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఎరుపు రంగు గాజులు  శక్తి, నీలి రంగు గాజులు  విజ్ఞానాన్ని సూచిస్తాయి.

ఆకు పచ్చ రంగు అదృష్టానికి, పసుపు రంగు సంతోషానికి గుర్తుగా చెబుతారు. బంగారు గాజులు ఎన్ని ఉన్నా ఒక్క మట్టి గాజు వేసుకోవాలి

పెద్దలే కాకుంగా శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మట్టి గాజులు ముతైదువు తనాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రతీ స్త్రీ ఖచ్చితంగా గాజులను ధరించాలి.