వేడి వేడిగా కొత్తిమీర వడలు..
ఇలా చేశారంటే ప్లేట్ ఖాళీ..
అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని మిక్సీలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి.
ఒక బౌల్లో శనగపిండి తీసుకుని అందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి.
స్టవ్పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు వేసి వేగించాలి.
కాసేపు వేగిన తరువాత కొత్తిమీర వేయాలి.
ఒకనిమిషం పాటు వేగిన తరువాత శనగపిండి మిశ్రమం వేసి కలుపుకోవాలి.
మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉంచి దింపుకోవాలి. ఒక ప్లేట్లో సిల్వర్ ఫాయిల్ పేపర్ తీసుకుని దానిపై ఈ మిశ్రమం పోయాలి.
అంతటా సమంగా పరుచుకునేలా చేతితో ఒత్తాలి. చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్పై పాన్ పెట్టి నూనె పోసి వేడి అయ్యాక వాటిని వేసి వేగించాలి. చట్నీతో వేడి వేడిగా కొత్తిమీర వడలు సర్వ్ చేసుకోవాలి.
Related Web Stories
తియ్యటి కర్భూజను ఈ సులభమైన ట్రిక్స్ తో ఈజీగా కనిపెట్టవచ్చు..
ఎయిర్పోర్ట్స్ లేని దేశాలు గురించి తెలుసా..
ఈ దేశాలలో ఎడ్యుకేషన్ టాప్..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నగరాలు ఇవే..