కొబ్బరి అన్నం ఇలా చేసి చూడండి  చాలా రుచిగా ఉంటుంది..

ముందుగా క్యాలీఫ్లవర్‌ ముక్కలను వేగించి  పక్కన పెట్టుకోవాలి.

వేరుశనగలను  వేగించి పక్కన పెట్టాలి.

 స్టవ్‌పై పాన్‌ పెట్టి కొబ్బరి నూనె వేసి వేడి అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు,  జీలకర్ర వేసి వేగించాలి.

మినప్పప్పు, శనగపప్పు  వేసి వేగించుకోవాలి.

కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించాలి.

ఇప్పుడు వేగించి పెట్టుకున్న వేరుశనగలు, క్యాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కలపాలి.

తగినంత ఉప్పు వేసి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. 

చివరగా కొబ్బరి  తురుము వేసి కలపాలి. 

ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి అంతటా సమంగా కలిసేలా కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.