గ్యాస్‌ పొయ్యిని శుభ్రపరచడం  చాలా కష్టమైన పని

స్టౌపై పేరుకుపోయిన నూనె, మురికి అంత త్వరగా వదలవు. దీని కోసం చాలా కష్టపడాలి

స్టవ్ పైన పేరుకున్న జిడ్డు, ఆహార అవశేషాలను తొలగించడానికి నిమ్మకాయ, బేకింగ్ సోడా, వెనిగర్ వంటి సహజ పదార్థాలు బాగా ఉపయోగపడతాయి.

స్టవ్ గ్యాస్ బర్నర్ కూడా జిడ్డు తో నిండిపోతాయి. గ్యాస్ ఓవెన్ సరిగ్గా శుభ్రం చేయకపోతే, మంట బయటకు రాదు.

అందుకే వారానికి ఒక రోజు ప్రత్యేకంగా దీనిని శుభ్రం చేయాలి. గ్యాస్ బర్నర్లు సాధారణంగా డిష్ సబ్బుతో శుభ్రం చేస్తుంటాం.

ఉల్లిపాయ ముక్కలను వేడి నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత ఆ నీటిలో స్పాంజ్‌ను ముంచి స్టవ్‌ను తుడవచ్చు.

గ్యాస్ బర్నర్ లోపల వెనిగర్ చుక్కలు వేసి, కాసేపు అలాగే వదిలేయాలి.

తర్వాత డిష్‌ వాష్‌ వేసుకుని స్పాంజితో తోమితే అన్ని జిడ్డు మరకలు తొలగిపోతాయి.