మనసులోని ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వడాన్ని జర్నలింగ్ అని అంటారు.

ఈ అలవాటుతో మెదడులో మార్పులు వచ్చి సానుకూల భావనలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

మెదడులో తార్కిక ఆలోచనలకు కేంద్రమైన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ జర్నలింగ్‌తో క్రీయాశీలకం అవుతుంది

భయం, ఆందోళనలకు కారణమయ్యే అమిగ్దలా భాగం నెమ్మదించి సాంత్వన కలుగుతుంది

జీవితంలో సానుకూల అంశాలను పేపర్ రాసి చదువుకుంటే కృతజ్ఞతాభావం పెరిగి మనసు శాంతిస్తుంది

పరిస్థితులను సానుకూల ధరోణితో చూడగలిగే సామర్థ్యం, మానసిక దృఢత్వం ఇనుమడిస్తాయి. 

జర్నలింగ్‌తో మెదడులోని హిప్పోకాంపస్ భాగం క్రీయాశీలకం అయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది

మనసులో భావోద్వేగాల ఒత్తిడి తగ్గి ఆత్మనిగ్రహం పెరుగుతుంది