ఆకాకర కాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!

జీర్ణక్రియకు సహాయపడే ఆకాకరకాయలో సహజంగా లభించే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. 

తక్కువ క్యాలరీలు, కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా ఆకాకర కాయ ఆరోగ్యానికి అధిక మద్దతు ఇస్తుంది. 

ఆకాకరలో అనేది పోషకాహరంగా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ సి వంటివి ముఖ్యమైన పోషకాలుగా ఉన్నాయి.

బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ కావడానికి ఆకాకర చాలా ముఖ్యంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.

అనామ్లజనకాలు సమృద్ధిగా ఉండే ఆకాకరలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్లు, పాలీఫెనాల్స్, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, ఫ్రీరాడికల్స్ కణాలకు చేసే హానిని అడ్డుకొనడానికి సహాయపడుతుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న ఆకాకరలో కీళ్ల నొప్పులు, వాపులు, తగ్గించే శక్తి ఉంది. ఇది ఆర్థరైటిస్ వంటి పరిస్థితులతో బాధపడుతున్నవారికి మంచి ఆహారం.

గుండె ఆరోగ్యాన్ని కూడా ఆకాకర ప్రోత్సహిస్తుంది. ఇది అధిక ఫైబర్, అధిక పొటాషియం, అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాకరలో అధిక విటమిన్ సి కంటెంట్ అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ లకు వ్యతిరేకంగా రక్షణను ఇస్తాయి.