ఎండాకాలంలో చలవచేసే డ్రింక్స్‌ను జనాలు కోరుకుంటారు. ఇందులో పోషకాలు కూడా ఉండాలంటారు..

జనాలకు కావాల్సినవన్నీ ఇచ్చే ఒకేఒక డ్రింక్ నీర్ మోర్. బటర్ మిల్క్‌ రుచిలో స్పైసీగా ఉండే ఇది సూపర్ డ్రింక్ అట!

ఇంట్లోనే తయారు చేసుకునేందుకు అనువుగా ఉండటం నీర్ మోర్ మరో ప్రత్యేకత. దీన్ని ఎలా చేయాలంటే..

పెరుగు, మంచి నీళ్లు, కాస్తంత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవ గింజలు, మిరియాలు, జీలకర్ర, చెంచా నూనె తీసుకోవాలి. 

ముందుగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరతో పేస్ట్ చేసుకోవాలి.

ఆవ గింజలు, జీలకర్ర, వేడి చేసిన నూనెలో వేసి పోపు పెట్టాలి.

ఆ తరువాత పెరుగులో తగినంత నీళ్లు పోసి కలపాలి. దీనికి పోపును జత చేయాలి.  

చివరగా ఈ మిశ్రమంలో కాసిన్ని ఐస్ క్యూబ్స్‌ వేసుకుని తాగితే ఎండాకాలం ఇబ్బందులన్నీ మాయం!