ఈ వేసవిలో నేరేడు పళ్లు తినండి.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..!

చాలా అనారోగ్యాలను నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు, ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

నేరేడు పళ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తాయి. 

కాలేయం పనితీరును మెరుగుపరచడానికి, కాలేయ ఆరోగ్యానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. 

శరీరంలోని విషపూరిత పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపడంలో నేరేడు పళ్లు చక్కగా పని చేస్తాయి. 

యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు, మూత్ర సంబంధ సమస్యలతో సతమతమవుతున్న వారు నేరేడు పళ్లను తినడం మంచిది. 

నేరేడు పళ్లలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 

ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారు నేరేడు పళ్లను తినడం మంచిది. ఈ పళ్లలో కార్బోహైడ్రేట్లు ఉండవు. 

నేరేడు పళ్లను తినడం వల్ల చలవ చేస్తుంది. శరీరంలోని తాపం తగ్గుతుంది.