చలికాలంలో స్వెటర్లు వేసుకుని  పడుకోవడం మంచిదేనా..

శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం స్వెట్టర్లు, జాకెట్లు వంటి వెచ్చని దుస్తులను ధరిస్తారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వెటర్లు, సాక్స్ ధరించి నిద్రపోవడం మంచిదే. కానీ దీనికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అవసరం.

 స్వెటర్ వేసుకుంటే వెచ్చగా ఉంటుంది. కానీ మీరు ఎంచుకునే స్వెటర్ నాణ్యత, పరిశుభ్రత చాలా ముఖ్యం. చాలా బిగుతుగా ఉండే స్వెటర్లు శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి.

స్వెటర్ శుభ్రంగా, పొడిగా, గాలి పీల్చుకునేలా ఉండాలి. స్వెటర్ పాతదైతే, దుమ్ము లేదా మురికిగా ఉంటే అది చర్మంపై దురద, దద్దుర్లు, చికాకును కలిగిస్తుంది.

పడుకునే ముందు ఎల్లప్పుడూ శుభ్రమైన సాక్స్‌లను ధరించండి. మురికి సాక్స్ ధరించడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు, పాదాల దుర్వాసన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం, వాతావరణం, వ్యక్తిగత సౌకర్యాన్ని బట్టి దుస్తులు ఎంచుకోవాలి. వేసవిలో ఉన్ని దుస్తులను పూర్తిగా నివారించాలి.