ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రకృతి కన్ను తెరిచిందంటే చాలు విలయతాండవం చేస్తుంటుంది. తాజాగా ఇతర దేశాల్లో చోటు చేసుకుంటున్న భూకంపాలు తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.
భూప్రకంపనల కారణంగా క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అసలు భూకంపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి..? అందుకు కారణాలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్తరవేత్తలు.
భూమి నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ నాలుగు పొరలు ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌గా ఉంటాయి. క్రస్ట్, ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు.
ఈ 50 కి.మీ మందపాటి పొర అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. మనకు భూప్రకంపనలు వస్తాయి.
భూమి లోపలి పొరల్లో అలజడి వచ్చినప్పుడు ఏర్పడే కంపనాలు ఉపరితలాన్ని చేరడాన్ని భూకంపం అంటారు.
అధికమైన భూగర్భ జలాన్ని అధిక మొత్తంలో దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు.
అగ్నిపర్వత విస్ఫోటనాలు, అణు పరీక్షలు, భారీ గనుల తవ్వకాలు కూడా భూకంపాలకు దారితీయవచ్చు
భూకంపతీవ్రతను రిక్టర్ స్కేల్ ద్వారా గుర్తిస్తారు. 1935లో ఛార్లెస్ రిక్టర్ ఈ రిక్టర్ స్కేల్ ను కనిపెట్టారు. అందుకే దీనిని రిక్టర్ స్కేల్ గా పిలుస్తారు.