చలికాలంలో అందమైన చర్మం కోసం సింపుల్‌ టిప్స్‌..

ప్రస్తుతం యువత ఫిట్‌నెస్‌తో పాటూ అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడిపోతుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.

 ఇక శీతాకాలంలో చర్మం పొడిబారి అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించేందుకు ఇంట్లోని వస్తువులతో సింపుల్‌గా చేసుకునే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా టమాటాలను తురిమి దాని రసాన్ని తీయాలి. ఆ తరువాత ఈ రసాన్నివేళ్లు లేదా దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత,

 సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. టమోటాలలో ఉన్న విటమిన్ సి చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది.

 బంగాళదుంప రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మంలో ఉన్న నలుపుదనం తొలగిపోతుంది.

  ఒక గిన్నెలో 4 టీస్పూన్ల ముల్తానీ మట్టి,2 టీస్పూన్ల నిమ్మరసం, 4 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ గ్లిజరిన్ వేసి పేస్టు తయారుచేయాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి. ఆ తరువాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది వారానికి రెండు సార్లు చేయడం ద్వారా చర్మం మెరుస్తూ ఉంటుంది.