ముందుగా పండుమిర్చిని ముక్కలుగా కోసి చిటికెడు ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరి పెట్టుకోవాలి. ఉల్లిపాయని, ఒక పండుమిర్చిని సన్నగా తరగాలి.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి  నూనె వేసి వేడి చేయాలి.

ఇందులో వెల్లుల్లి  ముక్కలు, అల్లం ముక్కలు  వేసి బాగా వేపాలి.

 తర్వాత పండుమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు వేసి రెండు నిమిషాలు మగ్గించాక పండు మిర్చి పేస్టు, ఉప్పు వేసి కలపాలి.

ఇది వేగాక అన్నం, మిరియాల పొడి, ఆరోమాటిక్‌ పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత స్టవ్‌ మీద నుంచి దించాలి.

స్పైసీగా వేడిగా తినాలనుకునేవారికి ఈ  వంటకం బాగా నచ్చుతుంది.