ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..? ఇలా చేయండి..
లాక్ స్క్రీన్‌లో వాతావరణం, క్రీడా స్కోర్లు, న్యూస్ విడ్జెట్‌లు నిరంతరం రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ కాపాడవచ్చు.
కొత్త iOSలో Settings → Accessibility → Motion → Reduce Motion ఆన్ చేయడం ద్వారా ఇంటర్‌ఫేస్ సింపుల్ అవుతుంది, బ్యాటరీ సేవ్ అవుతుంది.
టైపింగ్ సమయంలో వచ్చే చిన్న వైబ్రేషన్లు కూడా బ్యాటరీ ఎక్కువ అయిపోతుంది. Settings → Sounds & Haptics → Keyboard Feedback → Haptic ఆఫ్ చేయండి.
అనవసర యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో డేటాను అప్‌డేట్ చేస్తాయి. Settings → General → Background App Refresh → అవసరమైన యాప్‌లకే ఆన్, మిగతా వాటిని ఆఫ్ చేయండి.
బ్యాటరీ 20% కంటే తక్కువగా ఉన్నప్పుడు Low Power Mode ఆన్ చేయడం ఉత్తమం. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ, ఆటో-డౌన్‌లోడ్స్, మెయిల్ ఫెచ్ తగ్గుతుంది.
ప్రతి యాప్‌కి లొకేషన్ అనుమతి అవసరం లేదు. Settings → Privacy & Security → Location Services → అవసరమైన యాప్‌లకే While Using అనుమతిని ఇవ్వండి.
App Storeలో ఆటోమేటిక్ అప్‌డేట్స్ నిరంతరం సర్వర్‌తో కనెక్ట్ అవుతుంది. Settings → App Store → App Updates ఆఫ్ చేయడం ద్వారా బ్యాటరీ సేవ్ అవుతుంది.
అన్ని యాప్‌లు నోటిఫికేషన్లు పంపాల్సిన అవసరం లేదు. Settings → Notifications → అవసరం లేని యాప్‌ల నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి.
Related Web Stories
ఉప్పాడలో ఎగిసిపడుతున్న అలలు...
సిల్కీ జుట్టు కోసం ఇలా ట్రై చేయండి
నిద్రలేమి.. ఎంత ప్రమాదకరమంటే..
మీ బాల్కనీ తోటలో పెరగడానికి 8 ఇండోర్-ఫ్రెండ్లీ కాక్టస్ రకాలు..