నిద్రలేమి.. ఎంత ప్రమాదకరమంటే..
నిద్రలేమి వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతారు. మానసిక సమస్యలు వస్తాయి.
నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్ ఉత్పత్తి పెరిగిపోతుంది. నీరసం, అలసట మొదలవుతాయి.
తగినంత నిద్ర లేకపోవడం బ్రెయిన్ మెమొరీ పవర్‌పై నెగిటివ్ ప్రభావం పడుతుంది.
నిద్ర సరిపోకపోవడం వల్ల చర్మ సమస్యలు, త్వరగా వృద్ధాప్యానికి చేరుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
లేట్‌గా నిద్రపోవడం వల్ల టైప్-2 డయాబెటిస్, హృదయ సంబంధ సమస్యలు రావచ్చని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
నిద్ర సరిపోకపోతే మెటబాలిజమ్ నెమ్మదిస్తుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
నిద్ర లేమి వల్ల గ్రెలిన్, లెప్టిన్ వంటి ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితమవుతాయి. హై క్యాలరీ ఫుడ్ తినాలనే కోరిక పెరుగుతుంది.
నిద్ర సరిపోకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు దండెత్తుతాయి.
కొందరిలో నిద్రలేమి డిప్రెషన్‌కు కూడా కారణమవుతుంది.
Related Web Stories
మీ బాల్కనీ తోటలో పెరగడానికి 8 ఇండోర్-ఫ్రెండ్లీ కాక్టస్ రకాలు..
ప్రోటీన్ పౌడర్ మానండి.. మిల్లెట్స్ తీసుకోండి..
ఎంతసేపు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది?
చికెన్‌లో నిమ్మకాయ పిండితే ఏం జరుగుతుంది