రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చిందా?
ఎవరికి చెప్పాలో తెలియడం లేదా?
139కి డయల్ చేస్తే చాలు.. మీ సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇస్తోంది రైల్వేశాఖ.
ఒకప్పుడు రైళ్లలో ఏదైనా సమస్యలుంటే ప్రయాణికులు తర్వాత వచ్చే స్టేషన్ మాస్టర్లకు చెప్పేవాళ్లు.
లేదంటే ఒక్కో సమస్యకు ఒక్కో నంబరుకు ఫోన్ చేసి చెప్పాల్సి వచ్చేది.
ఇప్పుడు రైల్వే శాఖ ఆ ఇబ్బందిని తొలగిస్తూ ఏకీకృత నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఏ ఫిర్యాదుకైనా, సమాచారానికైనా ప్రయాణికులు వెంటనే సహాయం పొందడానికి ఈ 139 నంబర్‌ను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
ఈ హెల్ప్‌లైన్ నంబర్ 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.
ప్రయాణికులు ఐవీఆర్‌ఎస్‌ను ఎంచుకోవచ్చు. లేదా స్టార్ బటన్‌ను నొక్కడం ద్వారా నేరుగా కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు కనెక్ట్ చేయవచ్చు.
Related Web Stories
Fatty Liver: ఫ్యాటీ లివర్ ఉందా? వీటిని అస్సలు తినకండి..!
ఇన్సులిన్ రెసిస్టెన్స్.. ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి..
జుట్టును నల్లబరిచే ఆయుర్వేదిక్ నూనె.. ఇలా తయారుచేసుకోండి
జుట్టుకు రంగువేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే