ప్రతిరోజూ ఇలా చేస్తే
ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది..
ఇంట్లో గోడలు, తలుపులు, వస్తువులపై సాధారణంగా ఏర్పడే మరకలు ఇంటి అందాన్ని తగ్గిస్తుంటాయి.
వంటగదిలో స్టీల్ సింక్‌పైన, కుళాయిల చుట్టూ తెల్లని నీటి మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని ఎంత రుద్ది కడిగినా పోవు.
అలాంటప్పుడు ఒక చెంచా ఆలివ్ నూనెకి అరచెంచా ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని మరకల మీద రాయాలి.
గంటసేపు ఆరినతరవాత వేడినీళ్లతో కడిగేస్తే మరకలన్నీ పోతాయి.
వంట పూర్తయిన వెంటనే స్టవ్‌ను కాగితం లేదా పలుచని గుడ్డతో తుడిచేయాలి. దీనివల్ల స్టవ్ పరిశుభ్రంగా ఉంటుంది.
ఇంట్లో ఉండే ఫ్యాన్‌లు, కిటికీలు, తలుపులను వారానికి ఒకసారి సబ్బునీళ్లతో శుభ్రం చేయాలి.
బూజు, దుమ్ము, ధూళి లేకుండా ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Related Web Stories
సజ్జ రొట్టెలు మెత్తగా, మృదువుగా రావాలంటే.. ఇలా చేయాలి..
రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ అప్లై చేయాలి..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాలు ఏంటో తెలుసా?
ఇలా చేస్తే.. నల్లాగా మారిన టీ జాలీ తళుక్కుమంటుంది.