ఇలా చేస్తే.. నల్లాగా మారిన
టీ జాలీ తళుక్కుమంటుంది.
‘టీ’ని వడబోయడానికి స్టీల్ జాలీని వాడుతుంటాం. కొన్ని రోజుల తరవాత ఇది నల్లగా మారుతుంటుంది.
దీనిని అలాగే వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని ఇంటి చిట్కాలతో జాలీని కొత్తదానిలా మార్చేయవచ్చు.
ఒక గిన్నెలో ఒక గ్లాసు వేడినీళ్లు పోయాలి. ఇందులో రెండు చెంచాల వెనిగర్ లేదా బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
ఈ నీళ్లలో టీ జాలీని మునిగేలా ఉంచాలి. అరగంట తరవాత స్క్రబ్బర్‌తో రుద్ది కడిగేస్తే జాలీ పూర్తిగా శుభ్రమవుతుంది.
టీ జాలీని ముందుగా నిమ్మచెక్కతో రుద్దాలి.
పది నిమిషాల తరవాత పాత్రలు కడిగే లిక్విడ్ సోప్ పట్టించి తోమితే జాలీ తెల్లగా మెరుస్తుంది.
Related Web Stories
పిల్లలకు చదువుతో పాటు ఇవి నేర్పిస్తేనే జీవితంలో సక్సెస్ అవుతారు!
రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు ఇవే..!
సింహాల గురించి ఈ విషయాలు తెలుసా..
స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే జుట్టు రాలదు.. కావాలంటే ట్రై చేయండి..