రోజుకు ఎన్నిసార్లు  ఫేస్ వాష్ అప్లై చేయాలి.. 

ముఖంలోని మురికిని శుభ్రం చేయడానికి చాలా మంది ఫేస్ వాష్‌ని ఉపయోగిస్తారు.

దీంతో ముఖంపై అంటుకున్న మురికి తొలగిపోతుంది.

అయితే, రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ అప్లై చేయాలి. తరచుగా అప్లై చేస్తే హానికరమా. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

బయట నుండి ఇంటికి రాగానే ముఖంపై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి ఫేస్ వాష్ ఉపయోగించవచ్చు. 

రాత్రిపూట మీ ముఖాన్ని ఫేస్ వాష్‌తో కడగాలి. ఎందుకంటే పేరుకుపోయిన మురికి చర్మాన్ని పొడిగా చేస్తుంది.

పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్‌ ఫేస్ వాష్‌ను ఎంచుకోవాలి.

జిడ్డు చర్మం ఉన్న వారు ఫోమ్ ఆధారిత ఫేస్ వాష్‌ను ఉపయోగించవచ్చు. 

 రోజుకు రెండు సార్లు ఫేస్ వాష్ వాడితే సరిపోతుంది.

తరచుగా అప్లై చేస్తే మీ ముఖం పాడయ్యే ప్రమాదం ఉంటుంది.