నకిలీ కుంకుమపువ్వును  గుర్తించడం ఎలా..!

ఒక చిన్న గ్లాసు నీటిలో కుంకుమపువ్వు రేకులు వేసి కలపాలి.

నీళ్లు వెంటనే రంగు మారితే అవి నకిలీవని గుర్తించాలి.

నిజమైన కుంకుమపువ్వు రేకులు రంగు విడవడానికి చాలా సమయం తీసుకుంటాయి. 

కుంకుమ పువ్వు రేకులు ఎరుపు రంగులో ఉంటాయి. కానీ వాటిని ఆహార పదార్థాల్లో కలిపినప్పుడు లేత పసుపు రంగుని విడుస్తాయి. 

రెండు రేకులను నోట్లో వేసుకుని నమిలితే నోరంతా చేదుగా అవుతుంది. 

అలా కాకుండా నాలుకమీద తీపిదనం తెలిస్తే అవి నకిలీవని గుర్తించాలి.

రేకులకు నిప్పు పెడితే అవి మండని పక్షంలో శుద్దమైన కుంకుమ పువ్వుగా గుర్తించాలి. నకిలీ రేకులు వెంటనే మండిపోతాయి.