ఒత్తిడి సమస్య.. ఇదిగో సింపుల్ పరిష్కారం
ఆవ నూనెలో ఒమేగా 3, 6 వంటి సంతృప్తి కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఈ నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. చర్మాన్ని సహజంగా మాయిశ్చరైజ్ చేయడంలో ఆవ నూనె ఉపయోగపడుతుంది.
ఆవ నూనెను అరికాళ్లకు రాసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నూనెలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిలో ఉండే ఆరోగ్యకర కొవ్వులు.. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.
ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు.. శరీరానికి చాలా మంచివని అంటారు.
ఆవనూనెతో అరికాళ్లను మసాజ్ చేయడం వల్ల కండరాలకు ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ సైతం మెరుగవుతుంది.
అధికంగా నడిచే వారు.. నిలబడి పని చేసే వారు రాత్రుళ్లు పడుకునే ముందు ఆవ నూనెతో అరికాళ్లను మసాజ్ చేసుకుంటే మంచిది.
ఇలా చేయడం వల్ల శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. నిద్రలేమి సమస్య దూరమై.. హాయిగా నిద్రపడుతుంది.
మహిళలకు నెలసరి సమయంలో కనిపించే కడుపు నొప్పి.. వంటి సమస్యలకు ఆవ నూనె చక్కగా ఉపయోగపడుతుంది.
రాత్రి పడుకునే ముందు ఆవ నూనెను అరికాళ్లకు మసాజ్ చేయడం వల్ల పీరియడ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
మానసిక ఒత్తిడితో బాధపడేవారు.. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే వారికి.. ఆవ నూనె చక్కటి పరిష్కారం.
గోరు వెచ్చని ఆవ నూనెతో పాదాలను మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
Related Web Stories
చదువుల్లో ముందుండేందుకు స్టూడెంట్స్ ఫాలో కావాల్సిన టిప్స్
తగినంత నిద్ర లేకపోతే.. ఈ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే..
సమోసా ఏ దేశానికి చెందిందో తెలుసా..
వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు ఇవే..