కండరాల బలోపేతానికి దోహదపడే కొన్ని పండ్లు ఉన్నాయి. అవేంటంటే..

కసరత్తుల తరువాత కండరాల నొప్పులు రాకుండా అరటిలోని పొటాషియం, కార్బోహైడ్రేట్స్‌ సాయపడతాయి

యాపిల్‌లోని యాంటీఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి కండరాలను బలోపేతం చేస్తాయి.

నారింజలోని విటమిన్ సీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, కండరాలు కసరత్తుల ఒత్తిడి నుంచి కోలుకునేలా చేస్తుంది.

బొప్పాయిలోని ఎంజైమ్స్ వల్ల శరీరం ప్రొటీన్లను మరింత మెరుగ్గా గ్రహిస్తుంది

పైనాపిల్స్‌లోని బ్రోమలిన్ అనే రసాయనం నొప్పులు తగ్గించి కండరాలు దృఢంగా మారేలా చేస్తుంది. 

ద్రాక్షలోని రెస్వెరాట్రాల్ వల్ల కండరాలు ఎక్కువ పనిభారాన్ని తట్టుకునేలా మారుతాయి.

ఆవకాడోలోని పొటాషియం, హితకర కొవ్వులు కూడా కండరాల పనితీరును మెరుగుపరిచి దృఢంగా మారుస్తాయి.