ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుందా?  ఈ టిప్స్ మీ కోసమే..

రాత్రి సమయాల్లో సరైన నిద్ర లేకపోవడం వల్ల రోజంతా నిద్ర వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలి.

వ్యాయామం.. శారీరక శ్రమలో పాల్గొనాలి.  శరీరంలో రక్తప్రవాహం పెంచడానికి కండరాలను యాక్టీవ్ చేయడానికి  వాకింగ్, శరీరాన్ని సాగదీసే వ్యాయామాలు చేయాలి. రాత్రి సమయంలో మంచి నిద్ర వస్తుంది. రోజులో నిద్రమబ్బు ఉండదు.

హైడ్రేట్.. శరీరం హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం.  శరీరంలో అవయవాలు సమర్థవంతంగా పనిచేయడానికి  నీరు సహకరిస్తుంది. నీరు బాగా తీసుకోవాలి.

కెఫిన్.. సాధారణంగా కెఫీన్ తీసుకోవడం మంచిది కాదని అంటారు. కానీ రోజులో ఒక కప్పు కాఫీ లేదా టీ తీసుకోవడం వల్ల  శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది.

పవర్ న్యాప్ .. రోజులో ఎప్పుడూ నిద్రగా అనిపిస్తున్నప్పుడు పవర్ న్యాప్ చక్కని మార్గం.  రోజులో అప్పుడప్పుడు 10 నుండి 20 నిమిషాల పాటూ నిద్రపోవాలి.  ఇది చురుకుదనాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

కాంతి.. శరీరంలో అంతర్గత గడియారాన్ని నియంత్రించడానికి కాంతి సహాయపడుతుంది. ఇది సూర్యకాంతి లేదా గదిలో కృత్రిమ వెలుగు అయినా సరే.. ఇది నిద్ర గడియారాన్ని నియంత్రణలో ఉంచుతుంది.