నేరుగా వెనిగర్ తాగకూడదు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 నుండి 2 చెంచాల 5-10 ml ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగాలి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

ఇది ఆకలిని తగ్గిస్తుంది, దీనివల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు.

శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

ఇందులో ఉండే ఎసిడిటీ వల్ల పళ్ళ ఎనామిల్ దెబ్బతినే అవకాశం ఉంది.

కాబట్టి తాగిన తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా స్ట్రా  ఉపయోగించి తాగాలి.

మీకు గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించిన తర్వాతే దీనిని మొదలుపెట్టండి.

బరువు తగ్గడానికి కేవలం ఆపిల్ సైడర్ వెనిగర్ మాత్రమే సరిపోదు, దీనితో పాటు సరైన ఆహారం వ్యాయామం కూడా తప్పనిసరి.