ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా?

ఇంట్లో అందరూ.. స్నానానికి ఒకటే సబ్బును వాడుతున్నారా?.. ఎంత డేంజరో తెలిస్తే షాకవుతారు!

సాధారణంగా మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఇంట్లో స్నానం చేయడానికి ఒకే సబ్బు వాడుతుంటారు.

 అందరూ ఒకే సబ్బు వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

స్నానానికి ఉపయోగించే సబ్బుపైకి సాల్మొనెల్లా, షిగెల్లా బ్యాక్టరీఇయా, నోరోవైరస్‌, రోటవైరస్‌, స్టాఫ్‌ వంటి వైరస్‌లు చేరతాయి.

ఒక వ్యక్తి ఉపయోగించిన సబ్బు వేరే వ్యక్తి ఉపయోగించడం వల్ల ఈ వైరస్‌లు మిగిలిన వారికి వ్యాపించే ప్రమాదం ఉంది.

అలాగే సబ్బు పెట్టె యూజ్‌ చేస్తున్నట్టయితే.. అందులో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.

 సబ్బుకి బదులుగా లిక్విడ్‌ హ్యాండ్‌ సోప్, లిక్విడ్‌ బాడీ వాష్‌ వాడటం బెటర్‌ అని వైద్యులు చెబుతున్నారు.

టవల్స్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.. ఒకరి యూజ్ చేసేవి మరొకరు వాడకూడదు అన్నది వైద్యుల సూచన.