మానవ చరిత్రలో అత్యంత పురాతన మత్తు పానీయం బీర్. 5 వేల ఏళ్ల క్రితం రాసిన ఓ పద్యంలో బీర్ గురించిన ప్రస్తావన ఉందట.
మధ్య యుగంలో యూరప్‌లో బీర్‌ను మార్నింగ్ డ్రింక్‌గా తీసుకునేవారట. డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుందని భావించేవారట.
బీర్ పోషకాలను కూడా అందిస్తుందని నమ్మేవారట. నీటి కంటే కూడా బీర్ సురక్షితం అనుకునేవారట.
బీర్ మీద వచ్చే నురగ వల్ల ప్రయోజనం ఉందట. బీర్ ఫ్లేవర్, ఆరోమా గాలిలోని ఆక్సిజన్ కారణంగా పాడవకుండా ఆ నురగ లాక్ చేస్తుందట.
పురాతన ఈజిప్ట్‌లో కూలీలకు కూలీగా బీర్లను ఇచ్చేవారట. ఒక్క రోజు పని చేస్తే 4 లీటర్ల బీర్ ఇచ్చేవారట.
సాధారణంగా బీర్‌లో 7 నుంచి 8 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది. అయితే ``స్నేక్ వీనమ్`` అనే బీర్‌లో ఆల్కహాల్ శాతం ఏకంగా 67.5 ఉంటుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ బీర్‌గా రికార్డులకెక్కింది.
బెల్జియం దేశం బీర్ల తయారీకి పెట్టింది పేరు. ఆ దేశంలో ఏకంగా 1500 రకాల బీర్లను తయారు చేస్తారట.
బీర్‌ను ఎక్కువగా వినియోగించే దేశంగా చెక్ రిపబ్లిక్ నిలిచింది. అక్కడ సంవత్సరానికి ఒక వ్యక్తి 180 లీటర్ల బీర్ తాగేస్తాడట.
ఖాళీ బీర్ గ్లాస్‌ను చూసి కొందరు భయపడతారట. ఆ ఫోబియాను సెనొసిల్లికాఫోబియా అంటారు.