ఊసరవెల్లి రంగులు మార్చడానికి
అసలు కారణం ఏంటో తెలుసా?
ఊసరవెల్లి తన శరీరరంగు
మార్చే ప్రత్యేకమైన జీవి.
ఇది ఇతర జీవులను భయపెట్టడానికి లేదా వేటాడేటప్పుడు తనను తాను మభ్యపెట్టడానికి ఈ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది.
అంతేకాకుండా.. మగ ఊసరవెల్లులు ఆడ ఊసరవెల్లులను ఆకర్షించడానికి రంగులు మార్చుకుంటాయి.
ఊసరవెల్లులు తమ చర్మంలోని ఇరిడోఫోర్స్ అనే ప్రత్యేక కణాల ద్వారా రంగులను మారుస్తాయి.
కోపం వచ్చినప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా ఊసరవెల్లులు తమ రంగులను మార్చుకుంటాయి.
చల్లగా ఉన్నప్పుడు ఊసరవెల్లులు తమ శరీరాన్ని వేడి చేసుకోవడానికి సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించడానికి ముదురు రంగులోకి మారుతాయి.
కొన్ని ఊసరవెల్లులు పరిసరాలలో కలసిపోవడానికి రంగులు మార్చుకుంటాయి. అయితే.. ఇది కొన్ని జాతులలో మాత్రమే జరుగుతుంది.
Related Web Stories
ఈ చిట్కాలతో బియ్యంలో పురుగు పట్టకుండా చేయవచ్చు..
హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందా? ఈ టెస్ట్లు చేయించండి..
పురుషులు జాగ్రత్త ఇవి తింటే..
స్మార్ట్ఫోన్ ఛార్జర్లు తెల్లగానే ఎందుకు ఉంటాయో తెలుసా?