ఈ చిట్కాలతో బియ్యంలో పురుగు ప‌ట్టకుండా చేయ‌వ‌చ్చు..

నిల్వ చేసిన బియ్యంలో పురుగులు పడుతుంగటాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత రోగాలు వస్తాయి.

 ఈ పురుగులు విస‌ర్జంచే వ్య‌ర్థాలు, మ‌లినాలు బియ్యంలో అలానే ఉండిపోతాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత రోగాలు వస్తాయి.

బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో బే ఆకులను ఉంచండి.  బియ్యాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.

బియ్యం నిల్వ చేసిన డబ్బాల్లో కొన్ని లవంగాలను వేయండి. దీంతో ఆ బియ్యంలోకి పురుగులు చేరవు.

వెల్లుల్లి పొట్టు తీసి బియ్యంలో ఉంచ‌డం వల్ల బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.

కొంత కర్పుం తీసుకుని చిన్న గుడ్డలో మూట‌లుగా క‌ట్టి బియ్యంలో ఉంచ‌డం వ‌ల్ల పురుగులు ప‌ట్ట‌కుండా నిల్వ చేసుకోవచ్చు.

 బియ్యాన్ని నిల్వ చేసుకునే డ‌బ్బా అడుగు భాగాన వేపాకును ఉంచాలి. ఇలా చేయ‌డం వల్ల కూడా బియ్యం పురుగు ప‌ట్ట‌కుండా ఉంటుంది.