స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్లు తెల్లగానే  ఎందుకు ఉంటాయో తెలుసా?

మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు వివిధ రంగుల్లో వస్తున్నప్పటికీ, వాటి ఛార్జర్‌లు, ఛార్జింగ్ కేబుల్‌లు ఎల్లప్పుడూ తెల్లటి రంగులోనే కనిపిస్తాయి.

తెలుపు రంగు శాంతి, సరళత, నమ్మకానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

 తెలుపు రంగు శుభ్రమైన, ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. అందువల్ల ఛార్జర్ ప్రీమియం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఆపిల్ వంటి కంపెనీలు తెలుపు రంగును ఉపయోగించడం ద్వారా వారి ఉత్పత్తులకు భిన్నమైన గుర్తింపు వచ్చింది.

అందుకే ఇతర కంపెనీలు కూడా తెలుపు రంగును ఎంచుకోవడం ప్రారంభించాయి. తద్వారా వారి ఛార్జర్‌లు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

మరొక ముఖ్య కారణం ఉత్పత్తి ఖర్చుల తగ్గింపు. సాధారణంగా ఛార్జర్‌ల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ స్వయంగా తెలుపు రంగులో ఉంటుంది.

ఇతర రంగులు జోడించాలంటే అదనపు రంగు మరియు ప్రాసెసింగ్ ఖర్చు అవసరం అవుతుంది.

కాబట్టి, తెలుపు రంగులో తయారు చేయడం కంపెనీలకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఇది ఉత్పత్తిని సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో తయారు చేయడానికి సహాయపడుతుంది.