మగవాళ్లే మందు తాగుతారు.. ఆడవాళ్లు మందును ముట్టుకోను కూడా ముట్టుకోరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది ఒకప్పటి ముచ్చట. ఈ రోజుల్లో చాలా మంది ఆడవారు మగవారితో పోటీ పడి మరీ మందును లాగిస్తున్నారు.
ఏ రాష్ట్రం అత్యధికంగా మద్యం వినియోగిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం పెరుగుతోంది.మద్యం పురుషులే కాదు మహిళలు కూడా బాగా తాగుతున్నారు.
మరి ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయిలు ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారో చూసేద్దాం.
భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్
కుచెందిన అమ్మాయిలు అత్యధికంగా మద్యం సేవిస్తున్నారట.
అరుణాచల్ ప్రదేశ్లో 24.2 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారట
అనంతరం సిక్కింలో 16.2 శాతం మంది అమ్మాయిలు మద్యం సేవిస్తున్నారట.
సిక్కిం తర్వాత అస్సాంలోని 7.3 శాతం మంది అమ్మాయిలు డ్రింక్ తాగుతున్నారట.
సిక్కింలో మద్యం తయారు చేసే, తాగే ఒక పురాతన సాంప్రదాయం ఉంది. ఇక్కడ విస్కీ ప్రసిద్ధి చెందింది.
తెలంగాణలో 6.7 శాతం మంది డ్రింక్ చేసేందుకు ఇష్టపడుతున్నారట.