వావ్.. బెండకాయ రసం..  ఎంత పవర్‌ ఉందో తెలుసా? 

బెండకాయలో సీ, ఏ, కే విటమిన్లతో పాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

బెండకాయ రసాన్ని పరగడుపునే తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజులో ఇతర సమయాల్లో తాగినా ఫలితం ఉంటుంది. 

బెండకాయలో నీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది. 

బెండకాయ రసంలో విటమిన్ సీతోపాటు ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్ డ్యామేజ్‌ను ఎదుర్కొని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 

ఉదయాన్నే బెండకాయ రసం తాగితే రోజంతా మీరు హైడ్రేటె‌గా ఉంటారు. మంచి శక్తి వనరుగా కూడా బెండకాయ నీరు పని చేస్తుంది. 

బెండకాయ రసం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫైబర్‌ను పుష్కలంగా కలిగి ఉండే బెండకాయ జీర్ణ క్రియ సజావుగా సాగేలా ప్రోత్సహిస్తుంది. 

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే బెండకాయ రసాన్ని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 

బెండకాయలను ముక్కలుగా కట్ చేసి వాటిని నీటితో నిండిన ఓ సీసాలో వేసి మూత పెట్టాలి. ఆ నీటిని 24 గంటల పాటు నిల్వ చేయాలి. 

24 గంటల తర్వాత ఆ నీటిని వడకాట్టాలి. బెండకాయల్లోని జిగురు నీటితో కలవడం వల్ల ఆ నీరు కాస్త చిక్కగా, చేదుగా ఉంటుంది. దానిని తాగండి.