ఫ్యాన్‌ను
ఈజీగా ఇలా క్లీన్ చేసేయండి..
ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారు. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ఇంట్లో తరచు అన్నీంటిని శుభ్రం చేసినా ఈ సీలింగ్ ఫ్యాన్ చాలా ఎత్తులో ఉండటం వల్ల దీనిని శుభ్రం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది.
దీనివల్ల ఫ్యాన్‌పై దుమ్ము, దూళీ ఎక్కువగా పేరుకుపోతాయి.
ఇలా దుమ్ముతో ఉన్న ఫ్యాన్ తిరగడం వల్ల ఇంట్లోని గాలి కలుషితం అయి అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది.
సీలింగ్ ఫ్యాన్‌ను క్లీన్ చేయడానికి పాత దిండు కవర్‌ను ఉపయోగించాలి.
దిండు కవర్‌తో ఫ్యాన్‌పై ఉన్న దుమ్మను శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల దుమ్మ మీ ముఖంపై పడదు.
తర్వాత నిమ్మరసం, ఉప్పు కలిపి స్ప్రే తయారు చేయండి. ఆ స్ప్రేను ఫ్యాన్ బ్లేడ్లపై స్ప్రే చేయాలి.
తర్వాత ఫ్యాన్ బ్లేడ్లను శుభ్రమైన గుడ్డతో తుడవాలి.
ఇలా చేస్తే, మీ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కొన్ని నిమిషాల్లోనే క్లీన్‌గా కనిపిస్తుంది.
Related Web Stories
మన దేశంలోని సుందరమైన సరస్సులు ఇవే..
ప్రతిరోజూ ఇలా చేస్తే ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది!
సజ్జ రొట్టెలు మెత్తగా, మృదువుగా రావాలంటే.. ఇలా చేయాలి..
రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ అప్లై చేయాలి..