ఐదు నిమిషాల్లో తయారయ్యే  స్పాంజి బ్రెడ్ దోశ..

కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్ - నాలుగు, రవ్వ- కప్పు, బియ్యం పిండి- పావు కప్పు,

ఉప్పు, చక్కెర- అర కప్పు చొప్పున, పెరుగు- పావు కప్పు, నీళ్లు, నూనె- తగినంత.

ముందుగా బ్రెడ్ను ముక్కలుగా చేసి ఓ గిన్నెలో వేయాలి. 

ఇందులోనే బియ్యం పిండి, రవ్వ, పెరుగు, చక్కెర, ఉప్పు, నీళ్లు పోసి పావుగంట నానబెట్టాలి.

తరవాత మిక్సీలో తిప్పి మెత్తని పిండిగా చేసుకోవాలి. 

పెనం మీద దోశెల్లా  వేస్తే బ్రెడ్ దోశె రెడీ.