డిసెంబర్‌లో తప్పక చూడాల్సిన  ప్రదేశాలివే..  అస్సలు మిస్ అవ్వొద్దు..

  శీతాకాలం మొదలయ్యాక సహజంగా మనలో చాలామందికి టూరు వెళ్లాలన్న కోరిక పెరుగుతుంది. టూర్‌లు వేసేందుకు డిసెంబర్‌ అద్భుతమైన కాలం.

  అయితే, ప్రస్తుతం ప్రముఖ పర్యాటక స్థలాలు అన్నీ రద్దీగా ఉంటాయి. దీంతో, ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వారికి నిరాశ తప్పదు.

  ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారు భారత్‌లో ఏఏ ప్రదేశాలకు వెళ్లాలో తెలుసా..

  డిసెంబర్‌లో కేరళలోని మున్నార్ వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని తేయాకు తోటలు మరింత అందంగా ఉంటుంది.

  కర్ణాటకలోని కూర్గ్.. ప్రకృతి ప్రేమికులకు అనువైనది.

 కేరళలోని బ్యాక్‌వాటర్‌కు అలెప్పీ ప్రసిద్ధి చెందిన పట్టణం. హౌస్‌బోట్‌లో బ్యాక్‌వాటర్‌లో క్రూజ్‌పై వెళ్లడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

  డిసెంబర్‌లో పాండిచ్చేరి ఫ్రెంచ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.