నడుము నొప్పా..? ఇలా చెక్ పెట్టండి..!

  ప్రస్తుత కాలంలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి కారణం.. గంటల తరబడి ఒకే పొజిషన్‌లో కూర్చోవడం.

 తీవ్రమైన నొప్పి అయితే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి. సాధారణ నొప్పి అయితే వంటింటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.

  తేలికపాటి నొప్పి, కండరాల దృఢత్వం వల్ల కలిగే నొప్పికి ఇంటి నివారణలు దివ్యౌషధంలా పని చేస్తాయి.

  ఆవ నూనె, వెల్లుల్లి మసాజ్: వెన్ను నొప్పికి ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. ఆవ నూనెలో 8-10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించాలి.

  ఆ తరువాత గోరువెచ్చగా అయిన తరువాత నూనెతో వెన్నుకు మసాజ్ చేయాలి. ఇది మీ నొప్పిని క్షణాల్లో నయం చేస్తుంది.

 హాట్ కంప్రెస్: హాట్ ప్యాక్ లేదా వేడి నీటిలో టవల్‌ను ముంచి నడుముకు మర్దన చేయాలి. దీని వల్ల కండరాల దృఢత్వం తగ్గి రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. తద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

  పసుపు పాలు: రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల అర టీస్పూన్ పసుప కలిపి తాగాలి. ఇది వెన్ను నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

 సరైన భంగిమ: ఈ నివారణలతో పాటు.. సరైన భంగిమలో కూర్చోవాలి. అలాగే లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది.