బాణాలను వదిలి వేటాడే చేప..!

ఆర్చర్ ఫిష్.. సాలెపురుగులు, కీటకాలను నీటిలోపలి నుంచే వేటాడుతుంది. 

తూర్పు ఆఫ్రికా నుంచి ఆసియా చుట్టుపక్కల తీర ప్రాంతా జలాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

ఆర్చర్ చేపల కళ్ళు బైనాక్యూలర్ విజన్ కలిగి ఉంటాయి. ఈకళ్ళే వాటి వేటకు సహకరిస్తాయి. 

ఇవి నీటి ఒడ్డుకు దగ్గరలోనే ఉండి, ఎరను వేటాడటమే కాకుండా గుడ్లను కూడా అక్కడే పెడతాయి.

ఈ చేప 10 నుంచి 12 అంగుళాలు వరకూ పెరుగుతుంది. 

నీటి లోపలి నుంచి భూమి మీదకు వేటాడగల ఒకే ఒక చేప ఆర్చర్ ఫిష్.

ఈ చేప గాలిలో తన ఆహారాన్ని పట్టుకోవడానికి నీటి నుండి దూకుతుంది.